Hora Chakra| Astrology hora chart

వ్యాస పరిచయం / Short Summary

జ్యోతిష్య హోరా పట్టిక: శుభప్రదమైన ఉత్తమ హోరా సమయాలు మరియు అశుభ సమయాల గురించి తెలుసుకోండి.

హూర చక్రం | Hora Chakra గురించి తెలుసుకోండి

సమయం6-77-88-99-1010-1111-1212-11-22-33-44-55-6
ఆదిపగలురవిశుక్రబుధచంద్రశనిగురుకుజరవిశుక్రబుధచంద్రశని
రాత్రిగురుకుజరవిశుక్రబుధచంద్రశనిగురుకుజరవిశుక్రబుధ
సోమపగలుచంద్రశనిగురుకుజరవిశుక్రబుధచంద్రశనిగురుకుజరవి
రాత్రిశుక్రబుధచంద్రశనిగురుకుజరవిశుక్రబుధచంద్రశనిగురు
మంగళపగలుకుజరవిశుక్రబుధచంద్రశనిగురుకుజరవిశుక్రబుధచంద్ర
రాత్రిశనిగురుకుజరవిశుక్రబుధచంద్రశనిగురుకుజరవిశుక్ర
బుధపగలుబుధచంద్రశనిగురుకుజరవిశుక్రబుధచంద్రశనిగురుకుజ
రాత్రిరవిశుక్రబుధచంద్రశనిగురుకుజరవిశుక్రబుధచంద్రశని
గురుపగలుగురుకుజరవిశుక్రబుధచంద్రశనిగురుకుజరవిశుక్రబుధ
రాత్రిచంద్రశనిగురుకుజరవిశుక్రబుధచంద్రశనిగురుకుజరవి
శుక్రపగలుశుక్రబుధచంద్రశనిగురుకుజరవిశుక్రబుధచంద్రశనిగురు
రాత్రికుజరవిశుక్రబుధచంద్రశనిగురుకుజరవిశుక్రబుధచంద్ర
శనిపగలుశనిగురుకుజరవిశుక్రబుధచంద్రశనిగురుకుజరవిశుక్ర
రాత్రిబుధచంద్రశనిగురుకుజరవిశుక్రబుధచంద్రశనిగురుకుజ

రవి హోరా:

అధికారులను సంప్రదించడం, రాజకీయ, ఉద్యోగ వ్యవహారాలు, వైద్యం, క్రయవిక్రయాలు, కోర్టు లావాదేవీలు, సాహసంతో కూడుకున్న పనులు, విద్యాభ్యాసం, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, రాజకీయ చర్చలకు అనుకూలం.

శుక్ర హోరా:

శుభకార్యాలు, వాహన కొనుగోళ్లు, సంగీతం-నాట్య అభ్యాసం, తీర్థయాత్రలు, పరిమళ ద్రవ్యం, బంగారం, వెండి, ఇతర విలాస వస్తువుల కొనుగోళ్లు, పెండ్లిచూపులు తదితర పనులకు అనుకూలం.

బుధ హోరా:

వ్యాకరణం, గణితం, శిల్ప, వాస్తు తదితర శాస్త్ర అభ్యాసం, జాతక పరిశీలన, న్యాయ వ్యవహారాలు, రాసే పనులు, వ్యాపార ప్రారంభం, పరిశోధనలు, సాంకేతిక విషయాలు, మధ్యవర్తిత్వాలకు బుధ హోరా అనుకూలమైనది.

చంద్ర హోరా:

భోజనం, సముద్ర ప్రయాణాలు, నూతన దుస్తులు, నగలు ధరించడం, ఆలయ సందర్శన, దేవతార్చన, స్థల మార్పు, రాజీ ప్రయత్నాలు, ధాన్యం, పంట ఉత్పత్తులు, దుస్తులు కొనడం, మాతృ సంబంధ వ్యవహారాలకు చంద్ర హోరా అనుకూలం.

శని హోరా:

శుభకార్యాలకు శని హోరా అనుకూలం కాదు. మినుములు, ఇనుము, నువ్వులు, తైలం, యంత్రపరికరాల కొనుగోలు, శ్రమతో కూడుకున్న పనులకు, పరామర్శలకు, వాహనాల మరమ్మతులకు శని హోరా అనుకూలం.

గురు హోరా:

ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూల సమయం. శుభకార్యాల నిర్వహణ, పెండ్లి చూపులు, వివాహ నిర్ణయం, పుస్తక పఠనం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, భాషాధ్యయనం, బ్యాంకు లావాదేవీలు, నూతన వస్ర్తాభరణాల కొనుగోలు, తీర్థయాత్రలు, ధార్మిక విషయాలకు గురు హోరా అనుకూలం.

కుజ హోరా:

కొన్ని విషయాలకు మాత్రమే కుజ హోరా అనుకూలంగా ఉంటుంది. భూ వ్యవహారాలు, రియల్ఎస్టేట్, ఎలక్ట్రికల్, పోలీసులను సంప్రదించడం, భూ సేకరణ, గృహ నిర్మాణ భూకొలతలు, శస్త్ర చికిత్స విషయంలో వైద్యులను సంప్రదించడం తదితర పనులకు కుజ హోరా అనుకూలం.

ఈ వ్యాసం ఉపయోగకరంగా ఉందా?అన్ని పంచాంగ వ్యాసాలు చూడండి →

Telugu Calendar & Muhurthams

తెలుగు క్యాలెండర్, పండుగలు మరియు శుభ ముహూర్తాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.