వృషభం

Taurus

2026 భవిష్యత్తు (Yearly Prediction)

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు.
మీ పేరులో మొదటి అక్షరాలు: ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వూ, వే, వో.
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3.

ఈ సంవత్సరం గ్రహస్థితుల పరిశీలించగా మే నెల 14 తేదీ నుండి యత్న కార్యసిద్ధి, స్థిరాస్తి కొనుగోలు, చిరాకులు, కోర్ట్ వివాదములు అనుకూలించుట జరుగును. నూతన పెట్టుబడుల అనుకూలించును, ఉన్నత విద్యలకు చేయు విదేశీ ప్రయాణాలు మంచి అనుకూలించును, విద్యా, వైద్య, సాంకేతిక రంగాల వారికి మంచి అనుకూలముగా ఉండును, కిరాణా కొండ్లు, ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అనుకూలముగా ఉండును.దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారికి అనుకూల వాతావరణం. ఉత్తరార్థంలో గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంతవరకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వీరి మాటకు మంచి విలువ ఉంటుంది. కిరాణా దుకాణాలు, చిరువ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. రైతులకు రెండు పంటలు సుమారుగా అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గౌరవములు, మన్ననులు ఉండును.

ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 6: బుధవారం, శుక్రవారం, శని వారాలతో కూడిన ఐదు, ఏడు, తొమ్మిది తేదీలు అనుకూలించును. గ్రామదేవతల సందర్శన మంచి, అనుకూలం వీరికి.

  • ఉద్యోగం, వ్యాపారంలో క్రమంగా పురోగతి ఉంటుంది.
  • కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
  • విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి.
  • ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
  • ఖర్చులను నియంత్రిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
  • సహనం, క్రమశిక్షణతో వ్యవహరిస్తే సంవత్సరాంతంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.
🎨

అదృష్ట రంగు (Lucky Color)

తెలుపు

🔢

అదృష్ట సంఖ్య (Lucky Number)

6